
ఒకోసారి అనాలోచితం గా చేసిన పనులు ఎంతటి ఉపద్రవాన్ని తిసుకొస్తాయో చెప్పే సంఘటన ఇది.మొన్న అ మద్య christopher అనే సహచర ఆఫీసర్ cug నెంబర్ కి ఒక మెస్సేజ్ ఈ కింది విధం గా వచ్చింది
B-BSNL
R-RELIANCE
A-AIRTEL
H-HUTCH
M-MTNL
I-IDEA
N-NOKIA
ONLY A BRAHMIN CAN CONNECT PEOPLE TOGETHER.PROUD TO BE A BRAHMIN
అయితే అంతకు ముందు అ సీట్ లో వున్నతను బ్రాహ్మిన్ ప్రస్తుతం అతను వేరే పోస్ట్ లో వున్నాడు సో అతనికి ఈ మెస్సేజ్ ఫార్వర్డ్ చేద్దామన్న సదుద్దేశం తో అతని నెంబర్ కి ఫార్వర్డ్ చేసాడు. తర్వాత ఆ విషయం మర్చి పోయాడు ,రెండు రోజుల తర్వాత తనకి వచ్చిన శంకర గిరి మాన్యాల TRANSFER ఆర్డర్ చూసుకుని గోళ్ళు మన్నాడు ఇప్పుడు పెళ్ళాం పిల్లని వది లి వేరే రాష్ట్రానికి ఎలా పోవాలి అదీగాక తను అ పోస్ట్ కి వచ్చి పట్టుమని పది రోజులు కాలేదు అప్పుడే ఏంటి ఈ ఉపద్రవం అని ఆరా తిస్తే అతను బ్రాహ్మిన్ అనుకుని ఫార్వర్డ్ చేసిన cug నెంబర్ సుప్రీం బాస్ ది ఖర్మ వశాత్తు అయన AB (అదేనండి ANTI BRAHMIN)గ్రూప్ నాయకుడు .ఎప్పటి నుంచో christopher సీట్ మీద కన్నేసిన ఇంకో ఆఫీసర్ అదే టైం లో బాస్ రూమ్ లో వుండడం అప్పుడే మెస్సేజ్ రావడం దాన్ని మా బాస్ పైకి చదివి ఈ christopher అంటు ఆర్యోక్తి గా ఆగి పొతే అతను అందుకుని సార్ వాడు ఒరిజినల్ గా christopher శర్మ సార్ ఏదో డబ్బులకి ఆశ పడి మతం మార్చుకున్నా పూర్వపు వాసనలు ఎక్కడకి పోతాయి సార్ అంటు కల్పించి చెప్పడం తో బాస్ అది నిజమని నమ్మేసి మా వాణ్ణి శంకర గిరి మాన్యాలు పట్టించి ఆ ఆషాడ భూతి కి ఇతని సీట్ లో TRANSFER చేసేసాడు.అప్పటికి మా వాడు లోపలికి పోయి సార్ నేను ఒరిజినల్ క్రిస్టియన్ నేను మీ గ్రూపే సార్ అంటే బాస్ ఛి ఛి నాకు ఈ కులాలు మతాల మీద విశ్వాసం లేదోయి పనే పరమాత్మ పని చేసే వాడు మనోడు నీ మీద నమ్మకం తో ఈ భాద్యత అప్పచెప్పా కీప్ ఇట్ అప్ మై బాయ్ అంటే మా వాడు బావురు మంటూ వచ్చి నా కొంపముంచిన BRAHMIN అంటూ నా దగ్గరే ఏడ్చాడు . సో ఈ కులాల కుమ్ము లాట లో మన కులం ఏదో తెలీకుండా జాగర్త పడటం ,వేరే వాడి కులం CONFIRM గా తెలీకుండా SMS లు ఫార్వర్డ్ చెయ్యడం గట్రాలు చేసి EXTRA కష్టాలు కొని తెచ్చు కోకుడదని సారాంశం .ఆయినా గాని AB నాయకులు కులం confirm చేసుకోవడం కోసం official meetings followed బై లంచ్ వాటిని ఉపయోగించుకుని నిశితం గా వాడు తినేవి చూసి కని పెట్టడం ఇంకా అనుమాన నివృత్తి కోసం దగ్గరగా వచ్చి ఆప్యాయంగా పలక రిస్టున్నట్టు గా చేసి వాడి నడుము మీద చెయ్యి పెట్టి తడిమి ఏదన్నా స్పీడ్ braker లా (జంద్యం)తగిలితే ఇంక వాడి పేరు కంప్యూటర్ డేటా లో నిక్షిప్తం.