26 ఫిబ్ర, 2009

కొంపముంచిన BRAHMIN


ఒకోసారి అనాలోచితం గా చేసిన పనులు ఎంతటి ఉపద్రవాన్ని తిసుకొస్తాయో చెప్పే సంఘటన ఇది.మొన్న అ మద్య christopher అనే సహచర ఆఫీసర్ cug నెంబర్ కి ఒక మెస్సేజ్ ఈ కింది విధం గా వచ్చింది
B-BSNL
R-RELIANCE
A-AIRTEL
H-HUTCH
M-MTNL
I-IDEA
N-NOKIA

ONLY A BRAHMIN CAN CONNECT PEOPLE TOGETHER.PROUD TO BE A BRAHMIN
అయితే అంతకు ముందు అ సీట్ లో వున్నతను బ్రాహ్మిన్ ప్రస్తుతం అతను వేరే పోస్ట్ లో వున్నాడు సో అతనికి ఈ మెస్సేజ్ ఫార్వర్డ్ చేద్దామన్న సదుద్దేశం తో అతని నెంబర్ కి ఫార్వర్డ్ చేసాడు. తర్వాత ఆ విషయం మర్చి పోయాడు ,రెండు రోజుల తర్వాత తనకి వచ్చిన శంకర గిరి మాన్యాల TRANSFER ఆర్డర్ చూసుకుని గోళ్ళు మన్నాడు ఇప్పుడు పెళ్ళాం పిల్లని వది లి వేరే రాష్ట్రానికి ఎలా పోవాలి అదీగాక తను అ పోస్ట్ కి వచ్చి పట్టుమని పది రోజులు కాలేదు అప్పుడే ఏంటి ఈ ఉపద్రవం అని ఆరా తిస్తే అతను బ్రాహ్మిన్ అనుకుని ఫార్వర్డ్ చేసిన cug నెంబర్ సుప్రీం బాస్ ది ఖర్మ వశాత్తు అయన AB (అదేనండి ANTI BRAHMIN)గ్రూప్ నాయకుడు .ఎప్పటి నుంచో christopher సీట్ మీద కన్నేసిన ఇంకో ఆఫీసర్ అదే టైం లో బాస్ రూమ్ లో వుండడం అప్పుడే మెస్సేజ్ రావడం దాన్ని మా బాస్ పైకి చదివి ఈ christopher అంటు ఆర్యోక్తి గా ఆగి పొతే అతను అందుకుని సార్ వాడు ఒరిజినల్ గా christopher శర్మ సార్ ఏదో డబ్బులకి ఆశ పడి మతం మార్చుకున్నా పూర్వపు వాసనలు ఎక్కడకి పోతాయి సార్ అంటు కల్పించి చెప్పడం తో బాస్ అది నిజమని నమ్మేసి మా వాణ్ణి శంకర గిరి మాన్యాలు పట్టించి ఆ ఆషాడ భూతి కి ఇతని సీట్ లో TRANSFER చేసేసాడు.అప్పటికి మా వాడు లోపలికి పోయి సార్ నేను ఒరిజినల్ క్రిస్టియన్ నేను మీ గ్రూపే సార్ అంటే బాస్ ఛి ఛి నాకు ఈ కులాలు మతాల మీద విశ్వాసం లేదోయి పనే పరమాత్మ పని చేసే వాడు మనోడు నీ మీద నమ్మకం తో ఈ భాద్యత అప్పచెప్పా కీప్ ఇట్ అప్ మై బాయ్ అంటే మా వాడు బావురు మంటూ వచ్చి నా కొంపముంచిన BRAHMIN అంటూ నా దగ్గరే ఏడ్చాడు . సో ఈ కులాల కుమ్ము లాట లో మన కులం ఏదో తెలీకుండా జాగర్త పడటం ,వేరే వాడి కులం CONFIRM గా తెలీకుండా SMS లు ఫార్వర్డ్ చెయ్యడం గట్రాలు చేసి EXTRA కష్టాలు కొని తెచ్చు కోకుడదని సారాంశం .ఆయినా గాని AB నాయకులు కులం confirm చేసుకోవడం కోసం official meetings followed బై లంచ్ వాటిని ఉపయోగించుకుని నిశితం గా వాడు తినేవి చూసి కని పెట్టడం ఇంకా అనుమాన నివృత్తి కోసం దగ్గరగా వచ్చి ఆప్యాయంగా పలక రిస్టున్నట్టు గా చేసి వాడి నడుము మీద చెయ్యి పెట్టి తడిమి ఏదన్నా స్పీడ్ braker లా (జంద్యం)తగిలితే ఇంక వాడి పేరు కంప్యూటర్ డేటా లో నిక్షిప్తం.

21 ఫిబ్ర, 2009

నీతోనే నువ్వు సరదాగా లేనే లేవు


నాకు చాల ఇష్టమైన పాట గేమ్ సినిమా లోది , ఆ పాట సాహిత్యమ మీకోసం .

నీతోనే నువ్వు సరదాగా లేనే లేవు
నలుగురిలో నవ్వుల్నేం చూస్తావు
నువ్వేంటో అర్ధం కావు వేరేగా వుంటావు
నీ మనసెందుకు నీలోనే దాస్తావు.
ఎందు కోసమో ఆరాటం ,ఇచ్చి చూసుకో అన్నది లోకం
వొక్కసారి నువ్వు ఆలోచించు నీకోసం
ముందు వెనకనే చూడని మార్గం ,నడిచి పోఇన లౌక్యమ్ కొంచెం
పట్టివిడుపుల సర్దుకు పోనీ నీ నైజం

: ఏదేదో అనుకుంటావు ,ఇంకేదో చేస్తుంటావు ,
చిక్కులో పడుతున్టావ్ చిత్రంగా
ఏనేరం చెయ్యని నువ్వు బందీగా మిగిలావు
ఎంతొ అలజడి మోసావు మౌనం గా
అద్దం లో నీరూపు నీకు చుపెవారే
నీ దారినొదిలి కదిలారు
నీడైన నీవెంట లేనన్డి ఈనాడు
నీదే తప్పని నిందలువేసి కాలమెంత మారి పోయెరా

: పై పై నవ్వుల లోకం పైసాకే విలువిచ్చిందా
కన్నిరన్టిన స్వప్నం చెరిగిందా
వొంటరి తనమే నిన్ను వడగాలై తాకిందా
సత్యమ తెలిసి కనువిప్పే కలిగిందా
చేదేనా చేదే గాని దాన్ని మందే అనుకో
మంచెగా చేసింది నీ కధకు
బాధ లేనోడు భూమ్మీద లేనోడే
మనిషై పుడితే దేవుడికైనా కంట నీరు ఖాయమేనురా
జానేదో నేస్తం ,జరిగాకే తప్పులు చూస్తాం
నిన్నటి లెక్కను నేడే సరి జేద్దాం
గడి రాతిరి నిశబ్దం లో , నిజమేదో కనుగొందం
మరి పొద్దులో మెలుకువ గా అడుగేద్దాం
ఏళ్ళ కాలమీ అల్లరి కాలం , వొక్క తీరు గా వుండదు నేస్తం
మంచి చెడ్డలు బొమ్మ బొరుసే అనుకుందాం
పల్లమేమిటో చూసిన ప్రాణం లెక్క చేయదే ఎంతటి కష్టం
నెల తాకిన బన్తై మళ్ళి పైకోద్దాం
http://www.telugufm.com/Modules/Play/Default.aspx?pick=13313&mode=A

19 ఫిబ్ర, 2009

బొమ్మాలి-నరమాంస బక్షకి


ముందు మాట; ఈ కధ ఎవర్ని వుద్దేశించి రాయనప్పటికి స్వభావ రీత్యా తమనే వుద్దేశించి రాసానేమో అనుకుంటే నాకు కొత్తగా వచ్చిన నష్టం ఏమీలేదు వాళ్ళ వుడుకుమోతు తనం తప్ప.ఇంక కధ లోకి వస్తే అరుంధతి రెండోభాగం తీస్తే ఎలా వుంటుందన్న దానికి వుహ రూపమే మన కధ.
బొమ్మాలి బెంబేలెత్తి పోతూ ఉంటుంది.ఆ పశుపతి ని ఎలాగైనా పాడే ఎక్కించాలని .ఎందుకంటె ప్రతిసారి పశుపతి వదిలేసినట్టే కనబడుతూ మళ్ళి దాడికి దిగుతున్నాడు. దీనికీ పరిష్కారం ఏంటని తన అఘోరి బృందాన్ని ముందు రోజే సంప్రదిస్తున్డి. అందులో వృద్ద అఘోరి బాబా నువ్వు మూసి నది వొడ్డున అర్దరాత్రి పందికొక్కుల వేపుడు లో నరమాంసం బిరియాని వండుకుని మీ చెలికత్తెలతో కలిసి ఆ కంపుని ఆస్వాదిస్తూ పశుపతి నామ స్మరణ చేస్తూ పశుపతి వశం కరం అంటు నూటొక్క సార్లు ఆ కుళ్ళు కూపం లో పొర్లి ఆ నరమంసాన్ని ముక్క కూడా మిగల్చకుండా లాగిస్తేనే ఆ పశుపతి వశం అవుతాడు చిన్న ముక్క ని వదిలేసిన మళ్ళి కాష్మోరా బృందం తో దాడి చేసి ఏడు జన్మల పాపాలు బయటకు తీసి మళ్ళి నీ మొదటి జన్మ అయిన కోతి లా మార్చేస్తాడు అని చెప్తాడు.అప్పుడు బొమ్మాలి ''ఇంకా అర్దరాత్రి అవదేమి ఈ వెలుతురు చెదిరి పోదేమి ' అని పాడుకుంటూ తన చెలికత్తెల్ని తీసుకుని మూసి వైపు నడుస్తూ వుంటుంది.ఇంతలొ బొమ్మాలి ''అదే వాసన ,అదే కంపు నా నాసికలకి అదే ఇంపు 'అంటు ఒక చోట ఆగి పోయి మూసి వచ్చేసిందేమో నే అంటుంది చెలికత్తెలతో .నీ మొహం ఇది ట్యాంక్ బండ్ మూసి ఇంకా ఎన్నో కోసుల దూరం నడవాలి నీతో వస్తే ఇదే తంటా సోడా కూడా తాగిపించకుండా ఆమడ దూరం నడిపిస్తావు అంటారు. అబ్బమనం తిన బోయేది పందికొక్కు వేపుడు , నరమాంసం బిరియాని యెంత ఆకలి దాచుకుంటే అంత బాగా తినొచ్చు ఒక్క ముక్క కూడా వదలకుడదని అ వృద్ద అఘోరి బాబా చెప్పారు మర్చి పోయారా అంటు వాళ్ళని హుషారు చేస్తూ మాటల్లో పెట్టి మూసి దాకా లాక్కోస్తున్డి . అప్పటికే ఉస్మానియా మార్చురీ లో కుక్కలు పిక్కు తిని వదిలేసిన రెండు మూడు శవాల్ని ఒక బాడీ గా కుట్టేసి watchman వోబులేసు మందు కి ప్రలోభపడి పోయి బొమ్మాలి కి అంట గట్టేస్తాడు.ఆశవాన్ని దోరగా వేయించుకుని బిరియనికి సిద్దం చేస్తూ వుంటారు చెలి కత్తెలు . అదే వాసన అదే కంపు అంటు బొమ్మాలి ఉండి ఉండి ఒక సారి మూసి నది లో ముక్కు పెట్టి మరీ వస్తూ వుంటుంది.ఈ లోపే చెలి కత్తెలు కాలు నాది ,చెయ్యి నాది ,పీక నాది అంటూ కాట్ల కుక్కల లా పిక్కుని తినేస్తూ వుంటారు. దూరం నుంచి రెండు కళ్లు వాళ్ళని గమ నిస్తున్నాయని ఆ క్షణం లో వాళ్ళకి తెలిదు.బొమ్మాలి ఆబగా నర బిరియాని తిందామని వచ్చే టైం కి పంది కొక్కు వేపుడు తప్ప ఏమి లేదు .ఆ పశుపతి నీ జయించాలంటే వశీకరణ మంత్రం చదువుతూ మూసి కంపుని ఆస్వాదిస్తూ నక్క ల వుల్లనే బజన్త్రిలుగా భావిస్తూ వొక్క ముక్క కూడా వదలకుండా బొక్కలు తినక పొతే ఇంతా చేసింది బొక్కే .మూసి కంపు అస్వాదనకే అలవాటు పడ్డ బొమ్మాలి నాసికలు మిగత విషయాలు మర్చి పోవడం తో ఘోరమైన తప్పు తో రెండు మూడు శవాల్ని ఒకటి గా భావించి లాగించడం తో ఆ దూరం నుంచి గమనిస్తున్న కళ్లు చింత నిప్పుల ఎర్ర గా భగ భగ మన్డాయి . అవే కాల భైరవ కళ్లు .ఒక్క సారి భయంకరమైన రంకె ఆ రంకె తో పుర్రెలో మూసి నీళ్ళు పోసుకుని జుర్రు కొంటున్న బొమ్మాలి వెన్ను లో వణుకు మొదలైంది.అమ్మో తను మింగడం లో వున్న శ్రద్ద మంత్రం పలకడం లో చూపలేక పోయానే ఇప్పుడు నా కేది దారి ఈ పశుపతి గాన్ని లొంగ దీసుకున్దమనుకుంటే అనవసరం గా కాలభైరవుడి కోపానికి గురి కావలసి వచ్చినదే అనుకుంటూ చెలి కత్తెల కోసం చూస్తే ఇంకెక్కడి చెలి కత్తెలు ఎప్పుడో లగెత్తెసి పశుపతయ నమః అనుకుంటూ పారి పోతూ కని పించారు.ఇప్పుదేడి కర్తవ్యం మనుటయా ?, మరణించు టయ? అనుకుంటూ ''చరిత్ర ఎరుగని మహాపాతకం నా మనసునకే వచ్చిందా ? , ఎవరో ఎందుకీ రీతి సాధింతురు ఎవరో ఏల పగ బూని సాధింతురు అంటూ తను ఈ మద్యనే చదువుకున్న పాటల్ని పాడుకుంటూ పరిగెడుతూ పోతుంటే విశ్రాంతి కార్డు పడుతుంది . ఇది ''చార్మినార్ తాగు సమయము '' అంటూ పెద్ద హార్డింగ్ మీదకి కెమెరా జూం అవుతుంది.(మిగత భాగం మళ్ళి నవ్వుకోవాలని పించినప్పుడు ) )

15 ఫిబ్ర, 2009

మొగుణ్ణి కొట్టే మగువ (మందు కొట్టినప్పుడే)


ఈ రోజు పేపర్ లో న్యూస్ చూసాక ఇది రాయాలని పించింది.నిన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోకి మార్టిన్ అనే యువకుడు తన చిన్న పిల్లాన్ని చంకలో పెట్టుకుని ప్రాణ భయం తో ఇన్స్పెక్టర్ దగ్గరికి పరుగు పరుగున వచ్చి రక్షించండి , రక్షించండి అంటు వచ్చాడట. అయన వెనకే అతని భార్య సోనియా బాస్టర్డ్ ఐ విల్ కిక్ యు ఆన్ యువర్ అస్ , use లెస్ ఫెలో ఫీట్ ఫర్ nothing ఫెలో కాంట్ డో ఎనీ తింగ్ అంటు ఇన్స్పెక్టర్ ముందే చితకా బడడం మొదలెట్టిందట. దానికి ఇన్స్పెక్టర్ అడ్డు చెప్ప బోతే నిన్ను కూడా తంతా నా కొడకా అంటు తూలి పోతూ చిందులు వేస్తోందట, ఇంతకీ విషయం ఏంటా అని అరా తీస్తే ఆ మగువకి మూడ్ వస్తే ముందు గా ఫుటూ గా మందు కొట్టేసి ఆ ఫై భర్త ని అమ్మ నా బూతులు తిట్టి ఆ ఫై దాడికి తెగ బడుతుందట.పోలీస్ లు మళ్ళి యద విధి గా ఆవిడకి మజ్జిగ తాగించి తెలివి లోకి వచ్చాక రాజి కుదిరించి పంపారు.ఆ సందర్భంగా ఇన్స్పెక్టర్ వొక సలహా చెప్పాడట భర్త కి నీ భార్య కి తాగడం ఎలాగు అలవాటైంది కాబట్టి బ్లాగడం కూడా అలవాటు చేసేస్తే మందు కొట్టినప్పుడు నీ జోలికి రాకుండా ఏ'' కాగడా షర్మి'' అనో నచ్చని వాళ్ళను తన బ్లాగ్ లో తిట్టుకుంటూ శేష జీవితం గడిపెస్తుందని.ఇదేదో సరదాకి రాస్తున్నా అనుకునేరు మీకు అనుమానం పోవాలంటే ఈ రోజు హైదరాబాద్ ఈనాడు లోకల్ ఎడిషన్ చదివి ఇంట్లో ఆడవాళ్ళకి మందు కనబడకుండా జాగర్త పడగలరు.

10 ఫిబ్ర, 2009

మనుషులు మారాలి


చీకటి లో
బ్లాగు చీకటి లో
పోస్ట్ అనే పడవ లో
ఘోస్టు అనే వ్యాఖ్యతో
ఏ దరికో , ఏ దశకో
జాలరి వలలో చేపవు నీవే .గానుగ మరలో చేరుకువు నీవే.
జాలే లేని బ్లాగు లోకం లోన దారే లేని బ్లాగర్ నీవే
లేరెవరు.నీకెవరు
http://www.chimatamusic.com/playcmd.php?plist=2059

3 ఫిబ్ర, 2009

దేవీ కరుణించుము


ఇందుమూలముగా సమస్త బ్లాగ్ జనులకు తెలియ జేయునది ఏమనగా నాకు ఈ బ్లాగ్ తప్ప వేరే ఏ కాగడా తో గాని ,కంచు తో గాని, దుమ్ము తో గాని తుమ్ము తో గాని ,శరత్ కాలాలతో గాని , వసంత కాలాలతో గాని ,ఏ విధమైన క్రమ లేదా అక్రమ సంభంధాలు లేవు అని .ఏదో బ్లాగింగు అంటే మనసుకి తోచింది రాసేసుకుని చూసేసుకుని ఆ పైన మూసేసుకుని కూర్చోవడమే అనుకున్నా గాని ఇలా నాలుగు నెలలకే చాయంగల విన్నపాలు చేసుకోవలసి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.ఇంక నా మానసిక సంతులత గురించి వివరణ ఏమనగా , మొన్నటి వరకూ నా బుర్ర రామాయణ కల్ప వృక్షం , ఆ మద్య సున్నున్దలనబడే రవ్వలడ్డులు తిన్నప్పటి నుంచి రామాయణ విష వృక్షం లా మారిందని ఇంచుక అనుమానం.అప్పుడే ఏదో మత్తు ప్రయోగం జరిగి వుంటుందని అభిజ్న వర్గాల బోగట్టా. అందుకు విరుగుడుగా జన్తికలన బడే చక్కిలాలని ప్రమదావనం మిత్రు రాళ్ళు మొన్నటి సమాచారాన్ని ఇచ్చినట్టు గా తెచ్చి ఇచ్చిన యెడల మరల జన జీవన స్రవంతి లో పాడెదను.రండి ఉత్సహించి పాడెదము రక్షణ నిచ్చును అయ్యో ఇదేంటి దేవీ స్త్రోత్రనికి బదులు ప్రభువు స్తోత్రం చదువుతున్నా.నాకు మెంటల్ ఎక్కిన్దంట , పిచేక్కిన్ దంట , అయ్యో బ్రహ్మానందం స్టీల్లో dialogues వచేస్తున్నాయి baboi విరుగుడు ఇవ్వుమా దేవీ కరుణించుమా కటక్షించుమ.