27 ఆగ, 2013

నా బ్లాగ్ బతికే వుంది

 

నా బ్లాగ్ క్రమం తప్పకుండా చదివే వొక వీరాభిమాని గంట క్రితం మెయిల్ లో సందేశం పంపింది . అది చదివిన వెంటనే నాకు దిమ్మ తిరిగిన్ది. అదేంటి రవిగారు ఈ మద్య మీరు రెగ్యులర్ గా రాయనప్పటికి మీ పాత పోస్ట్స్ చదువుకుంటూ ఆనందిస్తుంటే వునట్టుండి మీ బ్లాగ్ డిలీట్ చేసేసారు? అదేంటి అంత తీవ్రమైన నిర్ణయం? అని చూడగానే వెంటనే నా బ్లాగ్ కి వెళ్లి చుద్దామంటే అది కాస్త డిలిటెడ్ అని చుపిస్తొన్ది. వొక నిమిషం ఏమి అర్ధం కాలేదు . నా మానాన నేను నా సోది ఏదో రాసుకుంటూ వుంటే (యిదివరకు లాంటి వివాదాల జోలికి పోకుండా ), అంత పనికట్టుకుని మరి నా బ్లాగ్ ని తీసివేయ్యాల్సిన అవసరం ఎవరికి వచ్చి వుంటుంది? ఇలాంటి కోతి చేష్టలకి పోయే నాతి  లేదా మరెవరైనా కేతి వున్నారా ?లేక కధ  లోని పాత్రలు నడిచి వచ్చి మరి పగ తీర్చుకున్తున్నయా? లేక యి దేమన్నా సాంకేతిక సమస్యా?మళ్ళి పాత కక్షలు ఎవరన్నా రాజేసి బ్లాగ్ లో చలి కాచు కున్దమనపన్నాగామా ?యిలా మనసు పరి పరి విధాల పొతొన్ది. ఎన్ని నిద్రలేని నిశిరాత్రులు ఆలోచనా తరంగాలని ,గుండె గొంతుల్లో నిక్షిప్తమై పోయి సమాధి కాబోతున్నా భావాల భాదల్ని అక్షర రూపం లోకి మలచి యిక్కడ నిక్షిప్తం చేసుకున్న పొదరిల్లు ఈ నా బ్లాగ్ . అటువంటింది వొక్క లిప్త కాలం లో ఎవరో ముష్కరుల దుశ్చర్యకి  బలి కాబోయి మళ్ళి బతికి బట్ట కట్టిందా? నిన్న
హైదరాబాద్ లో ఫుట్ పాత్ మీద పడుకున్నా వొక అభాగ్యున్ని ,తుపాకీ పని చేస్తోందో లేదో చూసుకోవడానికి మెడ మీద పెట్టి కాల్చి వాడు చచ్చిపోయాక జబర్దస్త్  పనిచేస్తుందన్నా అంటూ చక్కా  పోయినట్టు , తమ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు పని చేస్తోందో తెలుసు కోవడానికి నా బ్లాగ్ మీద వారి ప్రతాపం చూపించి దాన్ని కాసేపు చంపేసి మళ్ళి  పోనిలే అని బతికింప చేసారేమో తెలిదు . మళ్ళి నేను లాగ్ ఇన్ అయిన కొంత సేపటికి నా మానస పుత్రిక మళ్ళి కనిపించింది . మరి యిలా ఎందుకు జరిగిందో ?లేదా సాయంత్రం సెల్ లో చాలా కాలం తర్వాత పలక రించిన మరో మిత్రురాలికి తను చెపుతున్న స్వగతాలు వినక , నా సోది మొదలు పెట్టి యిది అదేనంటావా  నా బ్లాగ్ లో రాసినట్టు గా చదివి నీ అభిప్రాయం చెప్పు అన్న పాపానికి నా బ్లాగ్ పాపని పొట్టన పెట్టుకున్దామనుకుందా ?

ఏంటో ఎన్నోశేష   ప్రశ్నలు . నా కధలో ప్రేమికులది ప్రేమో ?మోహమో తెలిదు. ఎవర్ని ఎవరు ఏమి ఆశిస్తున్నారో తెలిదు? హైదరాబాద్ ఏమవుతుందో తెలిదు? నా బ్లాగ్ ని ఎవరు చంపు దామనుకున్నారో తెలిదు ?మళ్ళి  దయ తలచి వారే ఎందుకు బతికిన్చారో తెలిదు ?ఈ మద్య కొత్త అప్ప్ వచ్చిందట అది గాని ప్రియురాలి సెల్ లో పెడితే ఆ సెల్ నుంచి ఏమేమి సందేశాలు ఎవరెవరికి వెళుతున్నాయి , ఆమె ఎప్పుడెప్పుడు ఎవరి తో ఆ సెల్ నుంచి మాట్లాడింది మాత్రమె కాకుండా ఆమె యింట  బయట ఎవరితో ఏమి మాట్లాడుతున్నా కుడా , ప్రియుడు  సెల్ కి కాల్ వెళ్లి సైలెంట్ గా ప్రియురాలి గుట్టు రట్టు అవుతుందిట . ఏమిటో ఈ మాయ . యింక మనుషుల జీవితాలలో ప్రైవసీ అన్న పదానికి అర్ధం లేకుండా పోతోంది .'' సర్వే '' జనా సుఖినో భవంతు ..

5 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


అంతా గూగుల్ మాయ !

జిలేబి

Unknown చెప్పారు...

అంతే లెండి , జిలేబి తింటూ అంతా గూగుల్ మాయ అనుకోవడం తప్ప మనం ఏమి చేయ గలం ?

అజ్ఞాత చెప్పారు...

ఒంగోల్లో ఆంధ్రా కాపిటల్ పెడతారంటగా? దానిమీద మీ అమూల్యమైన అనితరసాధ్యమైన అనిర్వచనీయమైన అభిప్రాయం వినాలనుంది సార్

Padmarpita చెప్పారు...

హమ్మయ్య బ్రతికున్న బ్లాగ్ కబురు చల్లగా చెప్పారు.
అయినా అడపాదడపా కనీసం వారానికి ఒక్కసారైనా బ్లాగ్ ని శుభ్రంగా అలికి ముగ్గువేస్తే( పోస్ట్) ఇలా వైరస్ రాకుండా మా మనసుకి కాసింత మసాలా కూడా దొరుకుంతుంది కదండి :-) ఆలోచించండి!

Unknown చెప్పారు...

అజ్ఞాత నేను సమన్యాయం పాటిస్తూ సమన్వయం తో పోతున్నవాడిని ,వొంగోలు గిత్త అయినా హైదరాబాద్ బర్రె అయినా పాలు పితుక్కోవడమే నా పని .

పద్మార్పిత మూల దాగి ,ధూళి మూగి మూగబోయిన నా బ్లాగ్ వీణని మీ కామెంట్ రూపం లో సృజించి వారానికి వొక సారైనా బూజు దులిపి వాయించ మన్న మీ అభీష్టం మేరకు యిక నుంచి తప్పకుండా వారానికి వోకసరన్నా దుమ్ము దులుపుతా .